Ind vs SA 5th ODI : India Won First-Ever ODI Series In SA

Oneindia Telugu 2018-02-14

Views 730

India scripted history on Tuesday after they won their first ODI series in South Africa beating them by 73 runs. Kuldeep Yadav was the star performer with the ball and Rohit Sharma was the man of the match with super century

సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. పోర్ట్‌ ఎలిజబెత్‌‌ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది.
దీంతో సపారీ గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక సిరిస్‌ను గెలిచిన జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. తాజా విజయంతో ఆరు వన్డేల సిరిస్‌ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో డుమిని(2), డివిలియర్స్(6) దారుణంగా విఫలమయ్యారు. ఆమ్లా (72) ఒంటరిపోరాటం చేసినా జట్టును గట్టెక్కించలేకపోయాడు.
భారత బౌలర్లలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌లు మరోసారి సత్తా చాటారు. కుల్దీప్‌ 4 వికెట్లు పడగొట్టగా, చాహల్‌ 2, పాండ్యా2 వికెట్లు తీశాడు. బుమ్రా ఒక వికెట్‌ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌ తరఫున సూపర్‌ సెంచరీ (115 పరుగులు) చేసిన రోహిత్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఆదివారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్‌ వేదికగా జరుగనుంది.
ఈ సిరిస్‌లో తొలి నాలుగు వన్డేల్లో విఫలమైన రోహిత్ శర్మ ఐదో వన్డేలో మాత్రం చెలరేగాడు. ఇక, శిఖర్‌ ధావన్‌ (34), విరాట్‌ కోహ్లీ (26), శ్రేయీస్‌ అయ్యర్‌ (30) ఫరవాలేదనిపించారు. చివరి 10 ఓవర్లలో పరుగులు రాబట్టడంలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడ 4 వికెట్లు తీయగా, రబాడకు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో ఎంగిడి (4/51) వన్డే కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS