నేను యూస్‌లెస్ ఫెలోనే కానీ చిరంజీవి సినిమా రీమేక్ చేస్తా !

Filmibeat Telugu 2018-02-15

Views 416

Hero Nani become a producer for Awe! movie. This movie is set to release on August 16th. In this occassion, Nani spoke to Telugu Filmibeat exclusively. And Nani interested to remake megastar Chiranjeevi's movie. Nani revels this in an interview.

తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా మారారు హీరో నాని. ఆ తర్వాత వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాని నిర్మాతగా మారి అ! అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. నాని చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
డబ్బు ముడిపడి ఉన్నందున ప్రతీ సినిమాకు నేను బాధ్యతగా ఫీలవుతాను. కాకపోతే నిర్మాతగా నాకు మరో భయం పట్టుకొన్నది. చేతిలో సినిమాలు చక్కగా ఉన్నాయి. నటించిన సినిమాలు ఆడుతున్నాయి. ఇలాంటి సమయంలో వీడికి సినీ నిర్మాణం అవసరమా అని చాలా మంది అన్నారు.
కమర్షియల్ ఆలోచనలు లేకుండా ఓ మంచి సినిమా చేశాను. విజిల్స్ వేసే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమా ఇది. తెలుగు సినిమా పరిశ్రమకు ఓ కొత్తదనం అందించే సినిమా ఇది. అ! సినిమా గొప్ప సినిమా. ఖచ్చితంగా ప్రతీ ఒక్కరు కూడా ప్రశంసించే సినిమా ఇది. రిలీజ్ రోజు మెచ్చుకొంటారా? మరో సంవత్సరం తర్వాత మెచ్చుకొంటారా అనే మీరే గ్రహిస్తారు. అ! చిత్రం ఏ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన చిత్రం కాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూసి ఉండరని బలంగా చెప్పుతున్నాను.
నాకు ఏ స్టాటస్ లేన్నప్పుడు నన్ను పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. నా జర్నీలో ఎంతో మంది నాకు తోడ్పాటునందించారు. ఇప్పుడు మీరు నాకు వద్దు అనుకోవడం తప్పు. నాకోసం, నాతో సినిమాలు చేసేవారికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అని నాని అన్నారు.
నా కుటుంబంలో చాలా మంది మంచి జాబ్స్‌లో సెటిల్ అయిపోయారు. చాలా మంది నా కజిన్స్ అమెరికాలో మంచి హోదాల్లో స్థిరపడ్డారు. అలాంటి సమయంలో నేను సినిమాలపై వ్యామోహం పెంచుకొన్నాను. అప్పట్లో నాని ఇంకా సినిమాలంటూ తిరుగుతున్నాడా అని అందరు అంటుండేవారు. నన్ను ఓ యూస్‌లెస్ ఫెలోగా చూసేవారు. అలాంటి యూస్‌లెస్ ఫెలోకు సినిమా మంచి జీవితాన్ని ఇచ్చింది. అలాంటి సినిమా పరిశ్రమకు నేను సంపాదించిన ప్రతీపైసే ఇక్కడే పెడుతాను.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS