It is disappointing that water is reduced to TN in Cauvery says Tamil Nadu CM Edappadi Palanisamy. He says that Cauvery verdict in a injustice to Tamil people
కావేరీ జలాలపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడులో రైతులు ఆందోళనకు దిగడంతో ఆ రాష్ట్రంలో చేపట్టా ల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి ముఖ్యమంత్రి ఎడ ప్పాడి పళనిస్వామి పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్డులోని ఎడప్పాడి పళనిస్వామి నివాసంలో జరిగిన సమావేశంలో చెన్నై నగర పోలీసు కమిషనర్ సహా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నిరాశమిగిల్చిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. కావేరీ జలాల తీర్పుపై పళనిస్వామి ఓ ప్రకటన విడుదల చేస్తూ తమిళనాడుకు రావాల్సిన కావేరీ జలాల పరిమాణాన్ని 177 టీఎంసీలకు తగ్గించడం విచారకరమని అన్నారు. అయితే కావేరీ నిర్వాహక మండలి ఏర్పాటుకు సుప్రీం కోర్టు ఆదేశించడం శుభపరిమాణమని సీఎం పళనిస్వామి చెప్పారు.
కావేరీ నిర్వహణ మండలి సక్రమంగా పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకువస్తుందని ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్ర హక్కులేవీ హరించుకుపోలేదని, వాస్తవానికి డీఎంకే ప్రభుత్వ హయంలోనే కావేరీ జలాలపై అనేక హక్కులను కోల్పోయామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు
కావేరీ జలాల పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో తమిళనాడు రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. కావేరీ నది నుండి 192 టీఎంసీల జలాల కన్నా కాస్త ఎక్కువగా నీరు కేటాయిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇస్తుందని ఆశలు పెట్టు కున్న రైతులకు చివరికి నిరాశే మిగిలింది.