Gundu Hanumantha Rao Lost Life

Filmibeat Telugu 2018-02-19

Views 19

Telugu comedian Gundu Hanumantha Rao, known for his iconic chef character in the TV serial Amrutham lost life. reports says The actor was facing a financial crisis before lost life

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంత రావు(61) ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల కాలం పాటు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. గత కొంత కాలంగా హనుమంత రావు అనారోగ్యంతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. హనుమంత రావు హాస్య నటుడిగా దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 90 లలో ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించారు.
గుండు హనుమంత రావు 1956 అక్టోబర్ 10 న విజయవాడలో జన్మించారు. నాటకాలపై ఆసక్తితో ఆయన 18 ఏళ్ల వయస్సులోనే నాటక రంగం ప్రవేశం చేశారు. ఓ నాటకంలో దర్శకులు జంధ్యాల గుండు హనుమంత రావు నటనకు మెచ్చి ఆయనకు అహనా పెళ్లంట చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆహనాపెళ్ళంట చిత్రం ఆల్ టైం కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిన సంగతి తెలిసింది. ఆ తరువాత వరుసగా హనుమంత రావుని అవకాశాలు పలకరించాయి.
గుండు హనుమంత రావు యమలీల, పేకాట పాపారావు, ఘటోత్కచుడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి చిత్రాల ద్వారా హాస్య నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు.
సినీ అవకాశాలు తగ్గినకమ్రంలో ఆయన అమృతం సీరియల్ ద్వారా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అమృతం సీరియల్ బుల్లి తెరపై నవ్వులు పూయించింది.
హనుమంత రావు కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో దుర్భర జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు.
ఇటీవల హనుమంత రావు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి హనుమంత రావుకు ఆర్థిక సాయం అందించారు. ఈ తెల్లవారు జామున హనుమంత రావు మృతి చెందారు. దీనితో ఆయన తో నటించిన నటీనటులు, చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS