Telugu film TholiPrema is all set to make an entry into the Million Dollar Club in USA. Varun Tej and Rashi Khanna as the lead pair,Directed by Venky Atluri, the movie got a super hit talk. Also, the collections at the box office proved that the movie is a super hit.
ఓవర్సీస్ మార్కెట్‌లో టాలీవుడ్ చిత్ర౦ తొలిప్రేమ దుమ్మురేపుతున్నది. తొలి ప్రేమ ఒక మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఇక తొలిప్రేమ తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. అమెరికాలో ముఖ్యంగా ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తుండటం విశేషం.
తొలిప్రేమ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే రెండోవారంలోకి ప్రవేశించింది. రెండు వారాల్లో తొలిప్రేమ చిత్రం అమెరికాలో 6.30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి వరుణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.
తొలిప్రేమ చిత్రం రెండోవారంలో శుక్రవారం 39,068 డాలర్లు, శనివారం 68,648 డాలర్లు, ఆదివారం 53,403 డాలర్లు, సోమవారం 26,687 డాలర్లు వసూలు చేయడం గమనార్హం. ఈ చిత్రానికి అమెరికాలోని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం గమనార్హం.
తొలిప్రేమ తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్ల పరంగా సత్తా చాటుతున్నది. గత తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం 26.65 కోట్ల గ్రాస్, 16.2 కోట్ల షేర్ సాధించింది.
ఈ చిత్రం నైజాంలో 6.20 కోట్ల షేర్ (10.80 కోట్ల గ్రాస్), వైజాగ్‌లో 2.56 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.38 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.06 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.24 కోట్లు, గుంటూరులో 1.31 కోట్లు, నెల్లూరులో 50 లక్షలు కలెక్షన్లను వసూలు చేసింది.