Sai Pallavi bags Fidaa success credit, Tholi Prema for Varun Tej

Filmibeat Telugu 2018-02-13

Views 1.1K

Tholi Prema is real success of Varun Tej not Fidaa. Varun tej got huge appreciation among cine lovers for 3 shades character in Tholi Prema

ఎడారిలో నీటికోసం వెతుతుకుతున్నట్లు విజయం కోసం వెతుకుతున్న వరుణ్ కు ఫిదా చిత్రం ఒయాసిస్ లాగా కనిపించింది. వరుసగా వైవిధ్యమైన పత్రాలు చేస్తున్నప్పటికీ ఫిదా ముందు వరకు వరుణ్ కు విజయం దక్కలేదు. కానీ మంచి నటుడిగా ఎదుగుతాడని కంచె సినిమా తరువాత సినీ ప్రముఖులంతా తేల్చేశారు. ఫిదా చిత్ర విజయంలో వరుణ్ తేజ్ పాత్ర ఎంతంటే వెంటనే చెప్పడం కష్టం.
ఎందుకంటే ఆ చిత్రంలో హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి సక్సెస్ క్రెడిట్ మొత్తం ఎగరేసుకుపోయింది. ఎట్టకేలకు తొలిప్రేమ చిత్రంతో వరుణ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని చెప్పొచ్చు. సినీ అభిమానులు ఇప్పుడు ఎక్కువగా తొలిప్రేమ మరియు వరుణ్ తేజ్ గురించే చర్చించుకుంటున్నారు.
కంచె చిత్రం కమర్షియల్ సక్సెస్ కాకున్నా వరుణ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సందేశాత్మక చిత్రంలో వరుణ్ తేజ్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కాయి. సినీప్రముఖులు సైతం వరుణ్ గొప్ప నటుడు అవుతాడని కీర్తించారు.
మెగా హీరోలందరిలా వరుణ్ తేజ్ భిన్నంగా ఆలోచించడం అతడికి కలసి వచ్చిందని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ కోసం పాకులాడకుండా కమర్షియల్ చిత్రాలని దూరం పెట్టి మంచి పని చేశాడు.
ఫిదా చిత్రంతో వరుణ్ తేజ్ తొలి సక్సెస్ ని అందుకున్నాడు. కానీ ఆ ఆనందం వరుణ్ ముఖంలో కనిపించలేదు. ఎందుకంటే క్రెడిట్ మొత్తం సాయి పల్లవి కొట్టేసిందని క్రిటిక్స్ నుంచి కామెంట్లు వినిపించాయి. వారు ఖాతాలో ఓ విజయం అయితే చేరింది కానీ వరుణ్ కు సంతోషాన్ని ఇచ్చే చిత్రం మాత్రం కాదు.

Share This Video


Download

  
Report form