Yuzvendra Chahal New Record With 4/64

Oneindia Telugu 2018-02-23

Views 29

Yuzvendra Chahal gave 64 runs in his allotted four overs with an economy rate of 16. With this, he found himself topping the list of most number of runs conceded in a T20I match for India. The South African top-order has struggled against India's spinners during the series.

సెంచూరియన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో నాలుగు ఓవర్లు వేసి అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్ల జాబితాలో చాహల్ అగ్రస్థానంలో నిలిచాడు.
బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చాహల్ నాలుగు ఓవర్లు వేసి 64 పరుగులిచ్చాడు. దీని అర్ధం ఏంటంటే ఓవర్‌కి 16 పరుగులిచ్చాడు. టీ20ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా నాలుగు ఓవర్లలో ఇన్ని పరుగులు ఇవ్వకపోవడం విశేషం.
2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోగీందర్‌ శర్మ ఇచ్చిన 57 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత యూసుఫ్‌ పఠాన్‌ (54 పరుగులు, 2009లో శ్రీలంకపై), మహమ్మద్‌ సిరాజ్‌ (53, 2017లో న్యూజిలాండ్‌పై)లు 4 ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాళ్లు.
తాజాగా ఈ జాబితాలో 64 పరుగులతో చాహల్ అగ్రస్థానంలో నిలిచాడు. సఫారీ పర్యటనలో భాగంగా జరిగిన ఆరు వన్డేల సిరిస్‌లో చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌ బౌలింగ్‌లో పరుగులు తీయడానికే ఇబ్బంది పడిన సఫారీ బ్యాట్స్‌మెన్లు రెండో టీ20లో మాత్రం చాహల్‌ను ఊచకోత కోశారు.
తొలి టీ20లో చాహల్‌ నాలుగు ఓవర్లలో 39 పరుగులిచ్చి ఒక వికెట్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రెండో టీ20లో వికెట్ తీసుకోపోగా పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 శనివారం కేప్ టౌన్ వేదికగా జరగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS