Prime Minister Narendra Modi held talks with his Canadian counterpart Justin Trudeau in New Delhi on Friday. Canadian PM Justin Trudeau further stressed the need to expand India Canada trade and commercial ties in his joint briefing with PM Modi.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రువారం సాదర స్వాగతం పలికారు. ట్రూడో కుటుంబం వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన విషయం తెలిసిందే. వారు భారత్‌కు వచ్చిన ఆరు రోజుల తర్వాత మోడీ వారిని కలిశారు. శుక్రువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ట్రూడో కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. కారులో నుంచి దిగగానే ట్రూడోతో మోడీ కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ట్రూడో సతీమణితో కరచాలనం చేసి అనంతరం వారి పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ట్రూడో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.
శుక్రువారం మధ్యాహ్నం మోడీ, ట్రూడో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. కెనెడాలో సిక్కు ఉగ్రవాదం గురించి, ఉగ్రవాద నిర్మూలనలో పరస్పర సహకారంపై వీరు చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, వాతావరణ మార్పులు,, సహజ వనరులు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.