Rayalaseema Declaration : BJP Hits Out At Ally TDP

Oneindia Telugu 2018-02-24

Views 813

As the political clash between the Telugu Desam and the Bharatiya Janata Party over according Special Category status to Andhra Pradesh, the BJP on Friday announced the Rayalaseema Declaration, containing 16 demands that it wants met before the present term of the state government ends.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని పార్టీ నేతలకు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు దిశానిర్ధేశం చేశారు.రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్న తరుణంలో రాయలసీమ డిక్లరేషన్‌ను బిజెపి ముందుకు తేవడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొందరు పార్టీ నేతలు చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చారు. ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో శనివారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం నేపథ్యంలో కేంద్రంపై పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చెప్పారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా పనిచేయాలని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు దిశా నిర్ధేశం చేశారు.
రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే బిజెపి రాయలసీమ డిక్లరేషన్‌ను తెరమీదికి తెచ్చిందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. తాను కూడ రాయలసీమ బిడ్డేనని బాబు గుర్తు చేశారు. విమర్శలు చేసేవారు తాను కూడ రాయలసీమవాసినేనని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబునాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.బిజెపి నాటకాలు ఆడుతోందని పలువురు నేతలు బాబు దృష్టికి తెచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS