Dubai Media Highlighting Sridevi News

Filmibeat Telugu 2018-02-26

Views 6

Dubai media highlighting Sridevi lost life news. All section of Dubai media revising Sridevi's life. meanwhile UAE officials have revealed that Sridevi's Forensic test has been completed


శ్రీదేవి మరణం యావత్ సినీ అభిమానులని కలచివేస్తోంది. శ్రీదేవి మృతికి ప్రాధమిక కారణం ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురికావడమే. కాగా శ్రీదేవి మృతికి మరేమైనా కారణాలు ఉన్నాయని అనే విషయం తెలియాలంటే ఫోర్సెనిక్ రిపోర్ట్ రావలసిందే. శ్రీదేవి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఫోర్సెనిక్ రిపోర్ట్ లో ఏముందని విషయం అంతటా ఉత్కంఠగా మారింది. శ్రీదేవి భౌతిక ఖాయాన్ని దుబాయ్ నుంచి తరలిస్తున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. శ్రీదేవి మరణానికి గల పూర్తి కారణాలు త్వరలోనే తెలియనున్నాయి.
శ్రీదేవి మరణ వార్తని మీడియాకు మొట్టమొదట తెలియజేసింది ఆమె మరిది సంజయ్ కపూర్. వారి కుటుంబం మొత్తం ప్రస్తుతం దుబాయ్ లోనే ఉన్నారు. శ్రీదేవి మరణించిన కొద్దీ సేపటి తరువాత సంజయ్ కపూర్ దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ పత్రికకు ఈ విషయాన్ని తెలియజేసారు.
సంజయ్ కపూర్ ప్రస్తుతం తన వదిన పార్థివ దేహాన్ని ఇండియా కు తరలించే పనిలో బిజీగా ఉన్నారు. శ్రీదేవి పార్థివ దేహం ముంబైకు చేరుకున్న తరువాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
శ్రీదేవి మరణ వార్తతో దుబాయ్ మీడియా కుదుపుకు లోనయ్యింది. అక్కడి మీడియా సంస్థల్లో శ్రీదేవి వార్తే ప్రధాన అంశంగా మారింది. శ్రీదేవి జ్ఞాపకాలని దుబాయ్ మీడియా మొత్తం గుర్తుచేసుకుంది. దుబాయ్ ప్రముఖ పత్రిక ఖలీజ్ టైమ్స్ లో శ్రీదేవి పెద్ద చిత్రాన్ని ప్రచురించి చాందిని గోస్ ఆఫ్ అనే టైటిల్ కూడా పెట్టేసారు. శ్రీదేవి మారిన వార్తకు ఆ సంస్థ అధికప్రధాన్యత ఇవ్వడం విశేషం.
ఇక గల్ఫ్ టైమ్స్ కమ్యూనిటీ పత్రికలో శ్రీదేవి చిత్రాన్ని పేజీ మొత్తం ప్రచురించారు. 50 ఇయర్స్ ఆఫ్ లివింగ్ సినిమాటిక్ డ్రీమ్ అనే హెడ్డింగ్ కూడా పెట్టేసారు. శ్రీదేవి ఖ్యాతి ఖండాంతరాలు దాటిందనేదానికి ఇదే ఉదాహరణ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS