Allu Arjun request to media and fans to stop speculations over Sridevi lost life. Allu Arjun, Rana Daggubati, Kajal Aggarwal, Sumanth request the media to #LetHerRestinPeace
శ్రీదేవి ఆకస్మిక మరణం లక్షలాది మంది అభిమానులకు శోకాన్ని మిగిల్చింది. దుబాయ్ లో పెళ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవి అక్కడ బాత్ టబ్ లో మృతి చెందారు. బాత్ టబ్ లో మృతి చెందడం నమ్మశక్యంగా లేకపోవడంతో మీడియాలో పలురకాల ఉహాగానాలు మొదలయ్యాయి. శ్రీదేవి మరణం మిస్టరీగా మారింది.దీనికితోడు దుబాయ్ అధికారులు విచారణ పేరుతో శ్రీదేవి మృతదేహాన్ని ఇండియాకు తీసుకునివెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు.
శ్రీదేవి మృతి పట్ల అనుమానాలు బలపడుతున్న క్రమంలో ఎట్టకేలకు దుబాయ్ అధికారులు శ్రీదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మీడియాలో చెలరేగుతున్న ఉహాగానాల పట్ల పలువురు సెలెబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ జాబితాలో బన్నీ కూడా చేరడం విశేషం.
శ్రీదేవి మరణమే పెద్ద షాక్. అది ఎలాగు జరిగిపోయింది. ఇక అనవసరమైన ఉహాగానాలతో ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేయవద్దని, శ్రీదేవి లాంటి లెజెండ్రీ నటి ఆత్మకు శాంతి కలిగేలా సంయమనం పాటించాలని ప్రముఖ రచయిత కోనవెంకట్ ట్విట్టర్ ద్వారా మీడియాని, అభిమానులని రిక్వస్ట్ చేశారు.
శ్రీదేవి మరణం తరువాత తాను ఈ వార్తని నమ్మలేకున్నానని దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మెహ్రిన్, ఆమె మృతి పట్ల అసత్య ప్రచారాలు వద్దు అంటూ అభిమానులని ఉద్దేశించి ట్వీట్ చేసారు.