అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్, పవర్ స్టార్ కరుణిస్తాడా..!

Filmibeat Telugu 2018-03-03

Views 948

Sai dharam Tej wants Pawan Kalyan help. Now Sai dharam tej is action under Karunakaran movie.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రస్తుతం సాయిధరమ్ కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విషయంలో తేజు చిన్న మావయ్య సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గతంలో కొందరు నిర్మాతలకు కమిట్ మెంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరో చిత్రం లో నటించే మూడ్ లో కనిపించడం లేదు.
సాయిధరమ్ తేజ్ డెబ్యూ మూవీ రేయ్ చిత్రం ఇబ్బందుల్లో ఉంటె పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఆ చిత్రాన్ని విడుదల చేయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రేయ్ చిత్ర విడుదలలో పవన్ సహకారం మరువలేనిది అని పలు సందర్భాల్లో ఆ చిత్ర దర్శకుడు వైవిఎస్ చౌదరి వెల్లడించారు.
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ తొలిసారి అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తేజు ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.
సాయిధరమ్ తేజ్ చిన్న మావయ్యని ఈ చిత్ర ఆడియో వేడుకకు రప్పించాహడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆడియో వేడుకుకు ఇంకా చాలా సమయం ఉన్నపటికీ పవన్ కళ్యాణ్ కు ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా తేజు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS