YSR Congress leaders protest for the Special Category Status (SCS) at Jantar Mantar, delhi.
కొన్నాళ్ల పాటు హోదా అంశం ఏపీలో తెరమరుగైపోయిన సంగతి తెలిసిందే. టీడీపీ పూర్తిగా ప్యాకేజీ మాటకే పరిమితమైనప్పటికీ.. వైసీపీ మళ్లీ హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అటు ప్యాకేజీ సాధించలేక.. ఇటు హోదా గురించి మళ్లీ మాట్లాడక తప్పని పరిస్థితుల్లో టీడీపీ ఇరకాటంలో పడింది. ఇదే ఊపులో టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు.. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల పట్ల వైసీపీకి ఎంత చిత్తశుద్ది ఉందో చూపించేందుకు వైసీపీ మహాధర్నాను ఉపయోగించుకోనుంది.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న కార్యక్రమాలన్ని కేవలం పొలిటికల్ స్టంట్స్ అని టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ మాత్రం 'హోదా' అంశం ద్వారా ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపించాలని భావిస్తోంది. టీడీపీ కంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామే ఎక్కువ కష్టపడుతున్నామన్న భావన కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలన్ని భవిష్యత్తులో ఆ పార్టీకి కలిసొస్తాయా?.. వేచి చూడాల్సిందే.