Parliament Both the houses were adjourned within 10 minutes of convening amid protest by the Telugu Desam Party (TDP) MPs demanding 'Special Category Status' for Andhra Pradesh.
పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మిత్రపక్షమైన టీడీపీ ఎంపీలతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఆయన మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఏపీకి హోదా కోసం టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతబట్టుకొని ఏపీకి న్యాయం చేయాలని నిదించారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు వెంకటేశ్వర స్వామి విగ్రహం, పవిత్ర గ్రంథాలు పట్టుకొని ఆందోళనలు తెలిపారు. ఎంపీ శివప్రసాద్ కృష్ణుడి రూపంలో నిరసన తెలిపారు.