Why BJP behave like this with Andhara Pradesh?...And why dealing like this in the case of the ally TDP?...to develop in AP as they want within short time...BJP has prepared a strategy...That's while they deal like this.
ఆంధ్రప్రదేశ్ విషయంలో బిజెపి అత్యంత మొండిగా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. ఒక రాజకీయ పార్టీగా ఉండి తమ వైఖరి పార్టీకి నష్టం చేస్తుందని స్పష్టంగా తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా సాధారణంగా ఈ విధంగా వ్యవహరించదు. మరైతే బిజెపి ఎందుకలా వ్యవహరిస్తోంది?...
బిజెపి ఎప్పుడు రాజకీయం చేసినా అది సున్నితంగా ఉండదు...వాజ్ పేయి, అద్వానీ ల తరం తరువాత ఇప్పుడు మోడీ, అమిత్ షా రాజకీయం మరింత పదునుగా ఉండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే వెనుకఉండి నడిపించే ఆర్ఎస్ఎస్ కూడా ఉదారవాద రాజకీయాలను ప్రోత్సహించదనేది ప్రస్పుటమే...కాబట్టే బిజెపి ఎపికి సంబంధించి తమకు అనుకూల సమయం కోసం వేచిచూస్తోంది. సరైన సమయంలో సరైన ఫలితాన్నిచ్చే సరైన నిర్ణయం తీసుకోవడం కోసమే మోడి, అమిత్ షాల నేతృత్వంలోని బిజేపి ఎప్పుడూ పొంచి వుంటోంది
ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పని చేస్తే విజయమో...లాభమో...క్రెడిటో...దక్కితీరాలి...అనే కోణంలోనే చూస్తాయి. మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బిజెపి ఈ విషయంలో మరింత ఫోకస్డ్ గా ఉంటున్న విషయం అందరూ గమనించే ఉంటారు...అందుకే ఎపిలో రాజకీయ పరిణామాలు మారాలి...క్రెడిట్ తమకు దక్కేవిధంగా పరిస్థితులు రావాలి. అందుకే తమ మిత్ర పక్షం, భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశంతోనే మైత్రీ బంధం తెంచుకోవడానికి సిద్దపడింది.