Suresh Raina clean bowled for 1. Raina played a poor shot on a full toss and was clean bowled. Earlier India lost the wicket of Rohit Sharma for a duck. Shikhar Dhawan has holed out to long-off on 90
భారీ అంచనాలతో మైదానంలో అడుగుపెట్టిన రైనా కేవలం ఒకే ఒక్క పరుగుతో సర్దుకున్నాడు. ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా (1) పేలవ రీతిలో క్లీన్ బౌల్డయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో వికెట్లను పూర్తిగా విడిచిపెట్టి బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లిన సురేశ్ రైనా.. ఫుల్‌టాస్‌గా వచ్చిన బంతిని ఏమాత్రం అందుకోలేకపోయాడు.
ఫుల్‌టాస్ బంతి లెగ్, మిడిల్ వికెట్లు తగిలి వాటిని పడేసుకుంటూ.. పోతున్న దృశ్యాన్ని చూసి కోచ్ రవిశాస్త్రి, తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేయడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఫుల్‌టాస్ బంతికి ఓ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బౌల్డవడం చాలా అరుదు. ఏడాది తర్వాత ఇటీవల టీమిండియాలోకి పునరాగమనం చేసిన సురేశ్ రైనా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో విధ్వంసక రీతిలో బ్యాటింగ్ చేశాడు.