Modi's Reaction on Ashok Gajapathi Raju, Sujana Chowdary's resign

Oneindia Telugu 2018-03-09

Views 16

Civil aviation minister Ashok Gajapathi Raju and Sujana Chowdary submitted their resignation letters to Prime Minister Narendra Modi on Thursday evening after Modi had a telephonic conversation with Chandrababu Naidu.

ప్రజల సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని పార్టీ ఆదేశించిందని కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేసినట్టు కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తమ రాజీనామా పత్రాలను సమర్పించిన తర్వాత సుజనాచౌదరి, ఆశోక్ గజపతిరాజులు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఇద్దరు మంత్రులు తమ రాజీనామా పత్రాలను సమర్పించకముందే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ప్రధానమంత్రి మోడీ ఫోన్‌లో చర్చించారు. కానీ, రాజీనామా విషయంలో వెనక్కు తగ్గలేదు.

ఏపీ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేసినట్టు సుజనా చౌదరి చెప్పారు.కేంద్రంలో మంత్రులుగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదని సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు తాము రాజీనామా చేసుకొన్నట్టు చెప్పారు.

ఏపీకి అండగా ఉంటామని ప్రధానమంత్రి మోడీ తమకు హమీ ఇచ్చారని సుజనా చౌదరి చెప్పారు. తాము రాజీనామా పత్రాలను సమర్పించేందుకు మోడీ వద్దకు వెళ్ళిన సమయంలో ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు. ఏపీకి అండగా ఉంటామని తమకు మోడీ హమీ ఇచ్చారని సుజనా చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS