టీవీ నటి ఆత్మహత్య : సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు !

Filmibeat Telugu 2018-03-12

Views 2

Bengali TV actress Moumita Saha was lost life in her flat at Kolkata on Saturday. Moumita is not the only TV actress who ended her life due to depression or other personal reasons.

బెంగాళీ టీవీ నటి మౌమితా సాహా రెండు రోజుల క్రితం కోల్‌కతాలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు నుండి ఆమె తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. మౌమితా సాహా తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.... బెంగాళీ టీవీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాక పోవడం, పెద్ద నటి కావాలనే తన కోరిక నెరవేరక పోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఉంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే మౌమిత ఇలా చేయడం విచారకరమని, ఆమెకు ఇంకా చాలా వయసు ఉంది, మరికొంతకాలం ప్రయత్నించి ఉండాల్సింది అని అందరూ అంటున్నారు. మౌమితా సాహా తరహాలోనే గతంలోనూ కొందరు టీవీ నటీమణులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హిందీ టీవీ సీరియల్ బాలిక వధుతో పాపులర్ అయిన ప్రత్యేష బెనర్జీ ముంబైలోని తన ఫ్లాట్‌లో 2016లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు
మరో బెంగాళీ టీవీ నటి దిశా గంగూలీ కూడా 2015 ఏప్రిల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు
అస్సామీ టీవీ నటి, సింగర్ బిడిషా 2017 జులైలో గురుగ్రామ్‌లోని తన ప్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మరణంపై అప్పట్లో అనేక ఆరోపణలు వినిపించాయి.
ఎంటీవీ వీడియో జాకీ నిఫిసా 2004లో తన ఫ్లాట్ లో పెళ్లికి కొన్ని వారాల ముందు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మరో టీవీ నటి కుల్జీత్ రండవా 2008 ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడింది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS