India have got wins in seven of their nine T20Is at this venue in Colombo, including a victory last time out versus Bangladesh. both their defeats at the ground came when batting first.
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు టీ20 సిరిస్‌లో సోమవారం భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ సిరిస్‌లో ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన రోహిత్ సేన, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైప శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించి టైటిల్ రేసులోకి రావడంతో సిరీస్‌ను రసవత్తరంగా మారింది.
దీంతో సోమవారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకను భారత జట్టు ఓడిస్తే అగ్రస్థానంలోకి దూసుకెళ్లడంతో పాటు ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైన శ్రీలంక ఈ సిరీస్‌లో ఆశలు నిలుపుకోవాలంటే టీమిండియాను తప్పక ఓడించాలి. అంతేకాదు ఈ మ్యాచ్‌లో నెట్ రన్‌రేట్ కూడా కీలకపాత్ర పోషించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతుండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ధావన్ తన జోరుని ప్రదర్శిస్తున్నాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో ధావన్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. గత ఐదు టీ20 ఇన్నింగ్స్‌ల్లో ధావన్ 55, 90, 47, 24, 72 స్కోరు చేయడం చూస్తే అతని జోరు ఎలా ఉందో చెప్పొచ్చు. వీరిద్దరూ గనుక ఈ మ్యాచ్‌లో కుదురుకుంటే ప్రత్యర్ధి జట్టుకు చిక్కులు తప్పవు.