నిర్లక్షం చేసి ఉంటే మరింత ప్రాణనష్టం జరిగేది

Oneindia Telugu 2018-03-12

Views 92

Kamal Hassan says that he expresses his wish to TN government for rescue operations done in Kurangani Forest.

అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్లక్షం కారణంగా తమిళనాడు ప్రజలు ఇబ్బందులకు గురై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని నిత్యం ఆ రాష్ట్ర మంత్రుల మీద విమర్శలు చేసి విరుచుకుపడిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యస్థాపకుడు, హీరో కమల్ హాసన్ మొదటిసారి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
తమిళనాడులోని తేనీ జిల్లాలోని కురంగణి అటవీ ప్రాంతంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 9 మంది సజీవదహనం కావడంపైహీరో కమల్ హాసన్ సోమవారం విచారం వ్యక్తం చేశారు.
ట్రెక్కింగ్ కు వెళ్లే సమయంలో పర్వతారోహణ నిపుణులు, పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవాలని, నిర్లక్షంగా ప్రవర్థిస్తే ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోవాల్సి ఉస్తుందని, చివరికి వారి కుటుంబ సభ్యులకు విషాదం మిగులుతుందని కమల్ హాసన్ అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం సరైన సమయంలో స్పంధించి వెంటనే సహాయక చర్యలు చేపట్టడం వలన చాల మంది అమాయకులు ప్రాణాలు మిగిలాయని, నిర్లక్షం చేసి ఉంటే మరింత ప్రాణనష్టం జరిగేదని, అధికారులు చక్కగా పని చేశారని, కేరళ పోలీసులు సహకరించినందుకు అభినందిస్తున్నానని హీరో కమల్ హాసన్ అన్నారు.
తేనీ జిల్లాలోని కురగండి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చెయ్యడానికి స్థానిక అటవి శాఖ అధికారుల దగ్గర అనుమతి తీసుకోలేదన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. తేనీ జిల్లాలో సోమవారం బాధితులను పరామర్శించిన ఎడప్పాడి పళనిస్వామి జాతీయ మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలంలో ట్రెక్కింగ్ చెయ్యడానికి ఎవ్వరూ అనుమతి ఇవ్వరని అన్నారు.
కురగుండి అటవి ప్రాంతంలో మంటలు ఎలా వ్యాపించాయి అని విచారణ చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 9 మంది మరణించారని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అధికారికంగా ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS