With the Chandigarh airport likely to remain shut for maintenance works between May 12 and 31, the Punjab Cricket Association has requested BCCI to reschedule two league matches of Kings XI Punjab in the IPL.
హంగూ ఆర్బాటాల మధ్య మొదలుకాబోతుందన్న తరుణంలో ఐపీఎల్‌కు పెద్ద చిక్కొచ్చిపడింది. 2018 సీజన్ ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటైన పంజాబ్ జట్టు మ్యాచ్ షెడ్యూల్ మార్చమంటూ బీసీసీఐకు నివేదించుకుంది. దీంతో ఉత్సాహంగా మొదలుపెట్టాల్సిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సందిగ్ధతతో మొదలకానుంది. దానికి మూల కారణం చండీఘడ్ విమానాశ్రయాన్ని మరమ్మతుల పేరిట మే 12 నుంచి మే 31 వరకు మూసివేయనుండటమే.
ఈ నేపథ్యంలో త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొహాలిలో ఆడనున్న లీగ్‌లోని రెండు మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేయాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. బీసీసీకి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంత మైదానం మొహాలిలో మే 4 నుంచి మే 14 మధ్య నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ అంశంపై బీసీసీఐ ప్రెసిడెంట్ సీకే ఖన్నా మాట్లాడుతూ.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఓ విజ్ఞప్తి వచ్చిన విషయం వాస్తవమే. అది సరైన సమస్యే. దానికి ఓ కారణం ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తప్పకుండా వారి విజ్ఞప్తిని పరిశీలిస్తుంది అని ఆయన అన్నారు. షెడ్యూల్ మార్చమంటూ చేసిన ప్రతిపాదన కుదరని సమక్షంలో వేరే ప్రాంతంలో ఆడే యోచనలో ఉన్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో పంజాబ్‌లో ఆడాల్సిన ఒకటి లేదా రెండు మ్యాచ్‌లను లక్నోకు మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐపీఎల్ పాలకమండలి శుక్రవారం ముంబైలో సమావేశమై దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపింది.