Nidahas Trophy 2018 : Players Fights after Match

Oneindia Telugu 2018-03-17

Views 1

Players Insulted their opponents by doing dances in the feild .They have breaked the glasses in yhe dressing room .The managment of the stadium given statement for enquiry.


నిదాహస్‌ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి పైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ అనంతరం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి.
మ్యాచ్‌ చివరి ఓవర్లో బంగ్లాదేశ్-శ్రీలంక ప్లేయర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు.ఒకానొక దశలో మ్యాచ్‌ నిలిచిపోతుందేమో అనిపించేలా బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు వ్యవహరించారు. అయితే.. ఎట్టకేలకి ఆ జట్టు కోచ్,అంపైర్లు చొరవ తీసుకుని ఆటగాళ్లని శాంతపరచడంతో.. మ్యాచ్ కొనసాగింది. ఉత్కంఠ పోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేయత్నం చేశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు.కెప్టెన్ సూచన మేరకు క్రీజులో ఉన్న మహ్మదుల్లా, రుబెల్ మైదానం వెలుపలకి వచ్చేసేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు వారికి సర్దిచెప్పారు. మరోవైపు కెప్టెన్‌కి బంగ్లాదేశ్ కోచ్, జట్టు మేనేజర్‌ ఖాలెద్‌ మెహమూద్‌ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్‌ కొనసాగించారు.

Share This Video


Download

  
Report form