Murali Vijay took to Twitter to congratulate the team but did not mention Dinesh Karthik's name in his congratulatory tweet. Dinesh Karthik fans Trolls Murali Vijay in Twitter
ఆఖరి బాల్.. ఐదు పరుగులు చేయాలి. ప్రత్యామ్నాయంగా సిక్సు కొట్టాల్సిందే. అలాంటి తరుణంలోనూ ప్రశాంత వదనంతో తన బ్యాట్‌ను ఝుళిపించాడు దినేశ్ కార్తీక్. అంతే బంతి సిక్సు బౌండరీకి పరుగులు పెట్టింది. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. కానీ, అందరికీ విరుద్ధంగా మురళీ విజయ్ మాత్రం కేవలం బీసీసీఐని మాత్రమే పొగిడి.. ఈ విజయంలో దినేశ్ కార్తీక్ పేరు ప్రస్తావించకపోవడంతో కార్తీక్ అభిమానులు ట్విట్టర్ వేదికగా మురళీ విజయ్‌ని తిట్టి పోస్తున్నారు. డీకే సహచర ఆటగాడు, ఒకప్పటి స్నేహితుడు మురళీ విజయ్ భారత విజయాన్ని అభినందిస్తూ 'ఇదొక గొప్ప విజయం.. భారత క్రికెట్ బ్రాండ్ విలువను పెంచేందుకు బీసీసీఐ చేస్తున్న కృషికి ఇది నిదర్శనం' అంటూ ట్వీట్ చేశాడు. జట్టు విజయానికి కారణమైన కార్తిక్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడంతో డీకే అభిమానులు మురళీ విజయ్‌కు కౌంటర్‌గా ట్వీట్ల ద్వారానే సమాధానం ఇస్తున్నారు.
'విజయ్ నీకు ఇదేమీ కొత్త కాదు.. ఇంతకు ముందు తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన డీకేని విస్మరించావు. నువ్వింకా ఎదగాలి' అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'మీ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. నిజాయితీగా స్పందించడం నేర్చుకో' అని మరొకరు సలహా ఇచ్చారు.
విజయ్ నువ్వు దినేశ్ కార్తీక్ గురించి ఏమయినా రాస్తావేమో అని చూసాం కానీ నువ్వు కేవలం బీసీసీఐ గురించి మాత్రమే ట్వీట్ చేసావు అని ఓ నెటిజెన్ మండిపడ్డాడు.