Mahesh's New Movie Getting Ready For Release

Filmibeat Telugu 2018-03-24

Views 222

Bharat Ane Nenu audio will be unveiled on April 7th in Vijayawada and the makers already acquired the necessary permissions for the same

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్‌ అనే నేను'. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు.
కాగా... ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్/ఆడియో వేడుక హైదరాబాద్‌లో కాకుండా ఏపీలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వైజాగ్ అనే వార్తలు వినిపించాయి. తాజాగా విజయవాడ పేరు తెరపైకి వచ్చింది. మరి ఎక్కడ నిర్వహిస్తారనే విషయమై నిర్మాతల నుండి ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఏప్రిల్‌ 7న ఈ వేడుక జరుగనుంది.
కాగా...సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్టు మొత్తం పూర్తయింది. అయితే ఒక పాట మాత్రం బ్యాలెన్స్ ఉంది. మార్చి 26 నుంచి స్పెయిన్‌లో ఆ గీతాన్ని చిత్రీకరిస్తారని, చిత్ర యూనిట్ అక్కడి నుండి తిరిగి రాగానే వేడుక నిర్వహించనున్నారు.

Share This Video


Download

  
Report form