Home Remedies To Get Rid Of Rats ఎలుకలను వదిలించుకోవటం ఇంత ఈజీ నా ?

Oneindia Telugu 2018-03-24

Views 2

To get rid of rats with natural remedies, you need to be smart to trap them. Take a look at some of these ways to Get Rid of rats naturally with the ingredients you use at home.

ఇళ్లలోని రంధ్రాలు గల మూలలను తమ అడ్డాలుగా చేసుకుని జీవనం సాగించే ఎలుకలు ఇష్టానుసారంగా మీ వస్తువులని నాశనం చేసే ప్రయత్నాలు చేస్తుంటాయి. కాని కొన్ని గృహ చిట్కాల ద్వారా ఈ ఎలుకల ను నివారించవచ్చు.
ఎలుకలకు ముఖ్యంగా పెప్పర్మింట్ (పుదీనా) అంటే పడదు. కొన్ని కాటన్ బాల్స్ లో ఈ పెప్పర్మింట్ ఉంచి, ఎలుకలు వచ్చే ప్రాంతాలలో ఉంచడం ద్వారా వాటి రాకను తగ్గించవచ్చు. వారానికి ఒకసారైనా ఈ బంతులని మారుస్తూ ఉండాలి. వీటి కారణంగా ఇంట్లో మంచి సువాసన వచ్చుటయే కాకుండా ఎలుకలు తగ్గుముఖం పడుతాయి.
బంగాళాదుంపల పొడిని ఎలుకలు ఉన్న ప్రాంతంలో చల్లండి. ఎలుకలు వాటిని తిన్న తర్వాత, ఈ బంగాళా దుంప రేకులు వాటి పేగుల్లో ఇరుక్కుని చివరికి వాటి ప్రాణాలను తొలగిస్తుంది.
మనకే కాదు, ఎలుకలు కూడా ఉల్లిపాయల తీవ్రమైన వాసనని తట్టుకోలేవు. కాని ఉల్లిపాయలకి త్వరగా కుళ్లిపోయే స్వభావం ఉన్న కారణంగా ఇంట్లో ఉన్న పెంపుడు జంతువుల పై దాని విష ప్రభావం పడవచ్చు. కావున ప్రతి రెండవరోజూ ఒక ఉల్లిపాయని మార్చడం మంచిది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కొకోవా లేదా చాక్లెట్ మిశ్రమాన్ని ఎలుకలు తరచూ వచ్చే ప్రాంతంలో చల్లండి. అవి తిన్న తర్వాత నీళ్ళకోసం పరిగెత్తుతాయి. సరైన సమయంలో నీరు తాగలేని పక్షంలో అవి చనిపోతాయి కూడా.
మీ ఇంటి నుండి క్రిమికీటకాలను దూరంగా ఉంచడానికి చాలా చవకైన మార్గం. పెప్పర్ చల్లడం. ఎలుకలు ప్రవేశిoచే మార్గంలో ఈ పొడిని చల్లడం వలన, వాటి రాక తగ్గుముఖం పడుతుంది.
నీటితో, కత్తిరించిన వెల్లుల్లి కలపి ఆ మిశ్రమాన్ని ఎలుకలు వచ్చు మార్గంలో చల్లడం మంచిది. లేదా వెల్లుల్లి రెబ్బలను ఆ మార్గాలలో ఉంచినా ఎలుకల రాక తగ్గుతుంది.
ఎలుకలకు లవంగాలు అంటే ఇష్టం ఉండదు. ఎలుకల రంధ్రాల సమీపంలో ఒక వస్త్రంలో గుప్పెడు లవంగాలు ఉంచండి. ఎలుకలు ఈ మార్గం లో రావడానికి ఇష్టపడవు.

Share This Video


Download

  
Report form