Cheteshwar Pujara’s style of batting is always the center of discussion for cricket fans. He is arguably the most reliable batsman for team India in test cricket, his ability to play long innings and patience level is unmatchable, he has helped team India come out of tough situations many times in the longest format of the game
#Pujara
#Teamindia
#WTCFinal
#WorldTestChampionship
శనివారం ఆరంభం అయిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన అనంతరం చెటేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. దాంతో ప్రత్యర్థి బౌలర్లతో పాటు అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. పుజారా తన తొలి పరుగు చేయడానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టిన పుజారా పరుగుల ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మరో ఫోర్ కొట్టి.. చివరికి 54 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.