BJP chief Amit Shah today left his Chief Ministerial candidate in Karnataka, BS Yeddyurappa,with a slip of tongue, and quickly corrected himself. Recently a retired Supreme Court judge said if there was ever a competition of the most corrupt government then the Yeddyurappa government is number one...says Amit Shah
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నోరు జారి చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకులను, కర్ణాటక పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పను నివ్వెరపరిచాయి. అమిత్ షా చేసిన వ్యాఖ్యల వీడియో అతి కొద్ది వ్యవధిలోనే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఎక్కువగా కాంగ్రెసు మద్దతుదారులు ఆ వీడియోను సర్క్యులేట్ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెసు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ అత్యంత అవినీతికరమైన ప్రభత్వం ఏది అని పోటీ పెడితే యడ్యూరప్ప ప్రభుత్వం మొదటి స్థానంలో నిలుస్తుందని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇటీవల వ్యాఖ్యానించారని అమిత్ షా అన్నారు.
అమిత్ షా పక్కనే కూర్చున్న యడ్యూరప్ప ఒక్కసారిగా నివ్వెరపోయారు. అయితే, వెంటనే అమిత్ షా తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు. ఇంతలోనే కాంగ్రెసు మద్దతుదారులు ఆ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ వెళ్లారు. అమిత్ షా వ్యాఖ్యలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్‌లో స్పందించారు. అబద్ధాలకోరు అయిన షా చివరికి నిజం మాట్లాడారని అని అటూ అమిత్ షాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా పేరున్న 75 ఏళ్ల యడ్యూరప్పను బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.