King Nagarjuna - Natural Star Nani's Multi-Starrer Produced by Mega Producer C.Aswani Dutt in his prestigious banner 'Vyjayanthi Movies', Directed by T. Sri Ram Aditya is undergoing its regular shoot since Ugadi (March 18).
నాగార్జున, నాని హీరోలుగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనిదత్ , టీ. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న మల్టీ స్టారర్ ఉగాది (మార్చి 18) నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ చిత్రం హైదరాబాద్ లో మియాపూర్ స్టేషన్‌లో మెట్రో ట్రైన్ లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అందులో నాని, రశ్మిక మందన్న లతో పాటు సంపూర్ణేష్ బాబు ఉన్న సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో చిత్రం మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్ డి. పట్టి, శ్రీరామ్ ఆర్. ఇరగం, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, కో-డైరెక్టర్: తేజ కాకుమాను, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.శ్రీరామ్ ఆదిత్య.