Ball Tampering: Steev Smith's Autobiography Wents Into Clear Sale

Oneindia Telugu 2018-03-30

Views 118

Ball Tampering after Steev Smith's Autobiography Gets Low Rank & Is Kept Into Clear Sale ...His nbame gets disrespect after concerned issue.

ఒక్క బాల్ టాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్ జీవితం మారిపోయింది. అప్పటి వరకు ఐసీసీ ర్యాంకుల్లో టాప్ క్రీడాకారులతో పోటీపడుతున్న స్టీవ్ స్మిత్.. ప్రజల్లో మంచి క్రేజ్ సంపాదించాడు. అలాంటిది మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే కక్కుర్తితో తడబడ్డాడు తప్పుచేశాడు. దీంతో అతని కెరీర్ తలకిందులైంది.
కెప్టెన్సీ పోయి.. ఏడాది ఆటకు సైతం దూరం కావాల్సి వచ్చింది. అది చాలక కొన్నాళ్ల ముందే తన ఆత్మకథను మార్కెట్‌లోకి వదలినా.. మళ్లీ దాని గతి తప్పింది. అంతకుముందు క్రికెటర్ల జీవితాలు అనే స్థాయిలో ఉన్న పుస్తకం ఒకేసారి క్రైమ్ స్టోరీల స్థానానికి వచ్చేసింది.
నిన్నటిదాకా బ్రాడ్‌మన్‌ వారసుడిగా ప్రశంసలందుకున్నవాడు.. ఇప్పుడు మోసగాడు అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితి ఎలా తయారైందో చెప్పడానికి రుజువుగా నిలుస్తోంది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఇంకొక చిత్రం. మొన్నటిదాకా 24 అమెరికన్‌ డాలర్లకు అమ్ముడైన ఆ పుస్తకానికి ఒక్కసారిగా డిమాండ్‌ పడిపోయింది
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఒక పుస్తక విక్రయశాలలో దాని ధరను ఏకంగా 2 డాలర్లకు తగ్గించి క్లియరెన్స్‌ సేల్‌లో అమ్మేస్తున్నట్లుగా ఉంది. విమర్శల పరంపర కొనసాగుతూనే ఉన్నా.. గురువారం మీడియా సమావేశంలో పాల్గొని ఆవేదనతో ముగించిన ప్రసంగాన్ని చూసిన వారంతా సానుభూతిని తెలియజేస్తున్నారు.

Share This Video


Download

  
Report form