Karnataka Assembly Elections 2018 : అమిత్ షా మతం ఏంటి ?

Oneindia Telugu 2018-03-30

Views 319

Karnataka assembly elections 2018: "Amit shah is scared of me" Karnataka chief minister Siddaramaiah told about Amit shah and his Mysuru visit. He was talking to media in Mysuru.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నేనే అంటే భయం, అందుకే తాను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి నేనే ఏం చేస్తున్నాను అని గమనిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఏ మతంకు చెందిన వారో బహిరంగంగా ప్రజలకు చెప్పాలని చాలెంజ్ చేశారు. ఆ దమ్ము అమిత్ షాకు ఉంటే తరువాత తనను విమర్శించాలని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు.
కర్ణాటకలోని దాదాపు 40 మఠాలుకు పైగా సందర్శించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బీజేపీకి మద్దతు ఇవ్వాలని మఠాధిపతులకు మనవి చేశారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా మఠాలకు పోతే నాకేంటే ఇంకెక్కడికైనా పోతే నాకేంటి అని వ్యంగంగా అన్నారు.
తాను హిందువు కాదని, అందుకే హిందూ మతాన్ని చీల్చుతున్నానని, లింగాయుతలకు ప్రత్యేక మతం ఇవ్వాలని చెబుతున్నానని అమిత్ షా ఆరోపిస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే అమిత్ షా హిందువా, లేక జైన మతానికి చెందిన వ్యక్తినా అనే విషయం ఆయనే బహిరంగంగా ప్రజలకు చెప్పాలని సీఎం సిద్దరామయ్య సవాలు చేశారు.
కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని సీఎం సిద్దరామయ్య అన్నారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పతో సహ బీజేపీ నాయకులు కాళ్లు అరిగేలా తిరిగినా ఉప ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదని, జైలుకు వెళ్లి వచ్చిన వారందరూ ఇప్పుడు తనకు నీతులు చెబుతున్నారని సీఎం సిద్దరామయ్య ఎద్దేవ చేశారు.
మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి తాను శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని సీఎం సిద్దరామయ్య అన్నారు. అందుకే చాముండేశ్వరి నియోజక వర్గంలో పర్యటించటానికి వచ్చానని, వేరే నియోజక వర్గం మారే ఉద్దేశం తనకు లేదని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS