ఎట్టకేలకు పవన్‌తో కల్యాణ్ సుంకర.. జనసేనాని ఏమన్నారు..!

Oneindia Telugu 2018-04-02

Views 1.6K

After four years of joining in Janasena, Atlast Kalyan Dileep Sunkara met party President Pawan Kalyan at his office on Sunday.

జనసేనను ఎంతలా ఓన్ చేసుకుని ముందుకెళ్తున్నా.. సొంత పార్టీలోనే కొంతమంది పదేపదే తనకు మోకాలడ్డుతున్నారని ఇటీవలే కల్యాణ్ దిలీప్ సుంకర వాపోయిన సంగతి తెలిసిందే. తనకు తాను జనసేన అభిమానిగా చెప్పుకోవడమే తప్పించి.. పార్టీ ఎన్నడూ ఆయన్ను అధికారిక ప్రతినిధిగా గానీ, కార్యకర్తగా గానీ గుర్తించలేదు. అటు క్షేత్రస్థాయిలోనూ, ఇటు టీవి డిబేట్లలోనూ జనసేన గొంతును బలంగా వినిపిస్తున్నప్పటికీ.. తనపై వివక్ష చూపించే ప్రయత్నం కల్యాణ్ కు నచ్చలేదు. ఈ నాలుగేళ్లలో కనీసం పవన్ కూడా తన గురించి ఏనాడు పట్టించుకోకపోయినా.. సొంత పార్టీ వాళ్లే తనపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా.. తన పనేదో తానేదో చేసుకెళ్లాడు. ఇంతా చేస్తే.. 'కల్యాణ్ ను డిబేట్లకు పిలవొద్దు' అని న్యూస్ చానెల్స్ కు కాల్స్ వెళ్లడం ఇటీవల ఆయన్ను తీవ్రంగా బాధించింది.
ఈ నేపథ్యంలో పార్టీకి 'గుడ్ బై' చెప్పే యోచనలో ఉన్న కల్యాణ్ సుంకరకు పవన్ ఎట్టకేలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన ఇక పార్టీని వీడే ఆలోచన చేయరని తెలుస్తోంది. ఆదివారంతో తమ అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయినట్టు కల్యాణ్ ఫేస్‍బుక్ ద్వారా వెల్లడించారు.
అధినేతతో సుదీర్ఘ సమయం పాటు చర్చించడం జరిగిందని, ఇదో అద్భుతమైన అనుభూతి అని కల్యాణ్ అన్నారు. 41రోజులు మెడిటేషన్ చేయాలని, అప్పటిదాకా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలని ఆయన సూచించినట్టు తెలిపారు.
వ్యవస్థ పోరాడే శక్తి ఉన్నవాడివి.. నీ స్థాయేంటో తెలియని వ్యక్తులతో ఎందుకు సమయాన్ని వృథా చేసుకుంటావని పవన్ వ్యాఖ్యానించినట్టు చెప్పారు. నన్నూ ఎంతోమంది విమర్శిస్తుంటారని, అవన్నీ పట్టించుకుంటే గమ్యం చేరుకోగలమా? అని ప్రశ్నించినట్టు చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS