Chal Mohan Ranga Movie Twitter Review 'ఛల్ మోహన్ రంగ' ట్విట్టర్ రివ్యూ

Filmibeat Telugu 2018-04-05

Views 1.2K

Chal Mohan Ranga movie Twitter review. This is Nithin 25 film under Pawan Kalyan and Trivikram production.

నితిన్ నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ చిత్రం నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మరియు నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వంటి పెద్ద పేర్లు ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయి ఉండడంతో మొదటినుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. యూఎస్ లో ఇప్పటికే ప్రదర్శించబడిన షోల నుంచి ఛల్ మోహన్ రంగ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన అభిమానుల స్పందన, సోషల్ మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ ఉందొ ఇప్పుడు చూద్దాం.
రంగస్థలం సూపర్ సక్సెస్ తో టాలీవుడ్ కి ఈ వేసవి ఘనంగా ప్రారంభం అయింది. ఇటీవల విడుదలైన రంగస్థలం చిత్రం అద్భుత విజయం సాధించింది. అదే బాటలో నేడు విడుదలైన నితిన్ ఛల్ మోహన్ రంగ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఫస్ట్ హాఫ్ లో కామెడీ ప్రధాన బలంగా నిలిచింది. నితిన్, మేఘా ఆకాష్ పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది
తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ కు తమన్ సంగీతం కూడా ప్లస్ పాయింట్.
సెకండ్ హాఫ్ చిత్రానికి కాపాడింది. కామెడి బావుంది. నితిన్ ఛల్ మోహన్ రంగ ఈ వేసవిలో టైమ్ పాస్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది.
ఛల్ మోహన్ రంగ చిత్ర ఫస్ట్ హాఫ్ స్మూత్ గా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్ పరవాలేదు.
ఓవరాల్ గా ఛల్ మోహన్ రంగ చిత్రం బావుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కామెడీ ప్లస్ పాయింట్.
పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పీకే క్రియేటివ్ వర్క్స్ కు చల్ మోహన్ రంగ చిత్రం తొలి హిట్. అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS