Actor Nithiin has announced his upcoming film with director Krishna Chaitanya will release on April 5, And First Look Posters of Chal Mohan Ranga have a feel good touch.
హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'ఛల్ మోహన్ రంగ'. ప్రముఖ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా ఈ చిత్రానికి నిర్మిస్తుండడం విశేషం. త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నారు. అ..ఆ వంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఘనవిజయాన్ని అందుకున్న నితిన్ లై చిత్రంతో నిరాశపరిచాడు. కాగా మరో మారు రొమాంటిక్ జోనర్ నే నమ్ముకుని ఈ చిత్రంలో నటిస్తున్నాడు. నిన్ననే విడుదల ఈ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
లై చిత్రంలో మేఘా ఆకాష్ నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు. మేఘా చూపులకు మంచి మార్కులు పడడంతో మరో మారు నితిన్ ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు.
ఛల్ మోహన్ రంగ అనేది ఈ చిత్ర టైటిల్. చూడడానికి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తున్నా టైటిల్ ని గమనిస్తే మాత్రం ఈ చిత్రం ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది అని అనిపించక మానదు. టైటిల్ వెనుక భాగంలో చక్రం ఉంది. దాని పై ఎవిరి థింగ్ ఈజ్ సైన్ అనే క్యాప్షన్ ఉన్న పుస్తకాన్ని గమనించవచ్చు. అలాగే చక్రం కింది భాగంలో ఓ సీసా మరియు కుక్క ఉన్నాయి. వీటన్నింటిని గమనిస్తే ఈ చిత్రం ఏదో భారీ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది.
నితిన్ కు ఇప్పటి వరకు రొమాంటిక్ చిత్రాలు మాత్రమే విజయాన్ని అందించాయి. మాస్, మరియు యాక్షన్ ప్రధానాంశంగా వచ్చిన చిత్రాలన్నీ నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఛల్ మోహన్ రంగ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది.
ఛల్ మోహన్ రంగ చిత్ర విషయంలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా చిత్ర యూనిట్ వ్యవహరిస్తోంది. ఫస్ట్ లుక్ నుంచి సినిమా విడుదల వరకు అని తేదీల్ని నితిన్ ఇప్పటికే ప్రకటించేశాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల కాగా టీజర్ త్వరలోనే విడుదల కాబోతోంది. ఏప్రిల్ 5 న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.