కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం నాయకుల పిలుపు

Oneindia Telugu 2018-04-11

Views 1.1K

A senior Minister in the Naidu Cabinet said that the Central government is preparing ground for a CBI enquiry on the Pattiseema project as a part of its witch-hunt against Mr Naidu.

ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ భయం పట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది. హోదాపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో.. తనపై కక్ష సాధింపు చర్యలు ఖాయమని ఆయన భావిస్తున్నారట.
కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ దిశగా కేంద్రం అడుగులు వేయవచ్చునని ఇప్పటికే టీడీపీ ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అందుకే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం నాయకులు సైతం పిలుపునిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
సీఎం చంద్రబాబు సైతం కేంద్రం తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
మరోవైపు మంత్రి నారా లోకేష్, టీడీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలను రాష్ట్ర బీజేపీ నేతలు సైతం సమర్థించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, దీన్ని ఉపేక్షిస్తే మరింత డ్యామేజ్ తప్పదని బీజేపీ నేతలు కేంద్రానికి చెప్పినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర బీజేపీ నేతల ఫిర్యాదులు, కేంద్రంపై టీడీపీ విమర్శల దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించడానికే కేంద్రం సిద్దపడిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోసం పావులు కదుపుతున్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేశారు. కేవలం మట్టి తవ్వకాలకే రూ.192కోట్లు వృథా చేశారని ఆరోపించారు. దీనికి తోడు కాగ్(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక సైతం పట్టిసీమలో రూ.371కోట్లు దుర్వినియోగం అయినట్టు తెలిపింది. ఇక కాంట్రాక్టర్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించారని వైసీపీ చేస్తున్న ఆరోపణల సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS