Prime Minister Narendra Modi has said his government is committed to cooperative federalism. His comment came at an event in Chennai, and appeared to be an attempt to douse the rising flames of discontent in the South over the way the Centre shares money with state governments.
సహకార సమాఖ్యవాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మోడీ స్పందించారు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందని దక్షిణాది రాష్ట్రాల నుండి విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏ ఒక్క ప్రాంతం పట్ల తమ ప్రభుత్వం వివక్ష చూపడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తమ రాష్ట్రాలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తాయని దక్షిణాది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలో మోడీ ఈ వ్యాఖ్యలను తప్పు బట్టారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 15వ, ఆర్ధిక సంఘం సిఫారసులు కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగేలా కొన్ని ప్రాంతాలకు నష్టం కలిగేలా ఉన్నాయని చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి మోడీ కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జనాభా నియంత్రణ కోసం కృషి చేస్తున్న రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేంద్రం ఆర్థిక సంఘానికి సూచించిందని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో కృషి చేసిన తమిళనాడు రాష్ట్రంలో ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు. సహకార సమాఖ్యవాదానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మోడీ గుర్తు చేశారు. ఈ విషయంలో తాము గీత దాటబోమన్నారు. వాస్తవ విరుద్దమైన ప్రచారం చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనేది తమ నినాదమని ఆయన గుర్తు చేశారు.
తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో రెండు డిఫెన్స్ కారిడార్స్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోడీ వెల్లడించారు. నాలుగేళ్లలో తాము 1.3బిలియన్ డాలర్ల విలువ చేసే 794 ఎగుమతి అనుమతులు ఇచ్చామన్నారు. ఎక్స్‌పోలో 500 భారతీయ కంపెనీలు, 150 విదేశీ కంపెనీలను చూడడం చాలా అద్భుతంగా ఉందని మోడీ అన్నారు.