Upasana went to Tirumala by walk. To day Rangasthalam grand success event at Hyderabad
రంగస్థలం చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రాంచరణ్ కెరీర్ బెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఇప్పటికి ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. రాంచరణ్ నటన తో అదుర్స్ అనిపించాడు. వినికిడి లోపం ఉన్న పాత్రలో చరణ్ జీవించేసాడని ప్రశంసలు దక్కుతున్నాయి. చిత్ర దర్శకుడు సుకుమార్ అద్భుత దర్శకత్వ ప్రతిభని అంతా కొనియాడుతున్నారు. పల్లెటూరి కథ అందంగా, ఎమోషనల్ గా తెరకెక్కించారు.
రంగస్థలం చిత్రం జైత్ర యాత్ర తిరుగులేకుండా సాగుతోంది. రాంచరణ్ కెరీర్ లో ఈ చిత్రం అత్యుత్తమ విజయం అని చెప్పొచ్చు. చిట్టిబు పాత్రలో రాంచరణ్ ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేశాడు.
రంగస్థలం చిత్రం రెండు వారాల్లో 100 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 రికార్డుని సైతం అధికమించి బాహుబలి తరువాత రెండవ స్థానంలో నిలిచింది.
రంగస్థలం చిత్రానికి ముందే సుకుమార్ స్టార్ డైరెక్టర్. ఈ చిత్రం తరువాత సుక్కు క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. రంగస్థలం చిత్రం ద్వారా తాను అద్భుతాలు చేయగలనని సుకుమార్ నిరూపించుకున్నాడు.
తన భర్త నటించిన రంగస్థలం చిత్రం ఘనవిజయం సాధించడంతో ఉపాసన సంతోషంలో ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అలిపిరి నుంచి కాలినడక తిరుమలకు వెళ్ళింది. గురువారం ఉపాసన తిరుమల చేరుకుని శ్రీవారిని ధరించుకోవడం విశేషం. అలిపిరిలో కాలినడక ప్రారంభిస్తున్న సమయంలో ఉపాసన తన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.
రంగస్థలం చిత్రం విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ నేడు హైదరాబాద్ లో మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా హాజరవుతున్నారు. మెగా పవర్ స్టార్, పవర్ స్టార్ లని ఒకే వేదిక పై చూడాలని మెగా అభిమానులు ఆరాటపడుతుండడం విశేషం.