IPL 2018 SRH vs MI: Umpire Gets Injured After Ball Hits Him On Head

Oneindia Telugu 2018-04-13

Views 1

During the match between Sunrisers Hyderabad and Mumbai Indians umpire was injured after the ball hit him on his head. The incident happened when the umpire called for a time out and didn't pay attention to the ball coming to him.

ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌ సీకే నందన్ తలపైకి పొరపాటున ముంబయి ఇండియన్స్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ బంతిని విసిరాడు. అయితే.. బంతి తక్కువ ఎత్తు నుంచి రావడంతో అతనికి ఎలాంటి గాయమవలేదు. కానీ.. నొప్పి ఉండటంతో కాసేపు ఐస్‌బ్యాగ్‌ని నందన్ తన తలపై ఉంచుకుని ఉపశమనం పొందాడు.
ఈ మ్యాచ్‌లో 148 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 5.5 ఓవర్లు ముగిసే సమయానికి 52/0తో నిలిచింది. ఈ దశలో.. ముంబయి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా విసిరిన బంతిని ధావన్ హిట్ చేసేందుకు క్రీజు వదిలి వెలుపలికి వచ్చాడు. దీంతో బ్యాట్ అంచున తాకిన బంతి...డీప్‌ఫైన్‌లెగ్ దిశగా బౌండరీకి వెళ్లిపోయింది. ఫీల్డర్ ఎవరూ బౌండరీ లైన్‌కి సమీపంలో లేకపోవడంతో.. ముంబయి ఇండియన్స్ డగౌడ్‌లోకి వెళ్లిన బంతిని రిజర్వ్ బెంచ్‌లోని ఆటగాళ్లు మైదానంలోని ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్‌కి అందించారు. ఈ బంతితో 6 ఓవర్లు ముగియడంతో.. ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ (బ్రేక్) కోరాడు. దీంతో.. ఫీల్డ్ అంపైర్ నందన్ బ్రేక్ సిగ్నల్ ఇచ్చి పక్కకి వచ్చిన క్షణాల వ్యవధిలోనే అతని తలపై బంతి పడింది.
క్రికెట్ నిబంధనల ప్రకారం.. బ్రేక్ సమయంలో బంతిని అంపైర్‌కి ఇచ్చేయాలి. దీంతో.. సూర్యకుమార్ యాదవ్ అంపైర్ నందన్‌కి బంతిని ఇచ్చే ఉద్దేశంతో విసరగా.. అది వెళ్లి.. నందన్ తలపై పడింది. పొరపాటుగా జరిగిన విషయం కావడంతో.. అంపైర్లు సూర్యకుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి బంతి వరకూ పోరాడి గెలిచిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS