IPL 2018: RCB Head Coach Daniel Vettori Sees No Chris Gayle Fear Ahead Of KXIP Clash

Oneindia Telugu 2018-04-13

Views 98

Royal Challengers Bangalore are hoping to get their campaign back on track after an opening game defeat, as they lock horns with Kings XI Punjab in the Indian Premier League (IPL) here on Friday (April 13). RCB finished second best in a cliffhanger to Kolkata Knight Riders after Sunil Narine snatched victory with a RCB will be expecting some fireworks from Brendon McCullum and AB de Villiers, who blasted a 27-ball 43 and a 23-ball 44, respectively, in the first game. McCullum's confidence will be high as he has completed 9,000 T20 runs in the last match.

శుక్రవారం జరిగే మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ ఆడతాడని తాను అనుకోవడం లేదని బెంగళూరు కోచ్‌ డానియేల్ వెటోరీ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం బెంగళూని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
సొంత మైదానంలో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఉంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు సునీల్‌ నరైన్‌ మెరుపు ఇన్నింగ్స్‌, నితీష్‌ రాణా అల్‌రౌండ్‌ ప్రదర్శనతో కోహ్లీ సేన ఓటమి పాలైంది. అయితే ప్రస్తుతం బెంగుళూరు దృష్టి తమ మాజీ ఆటగాడైన‌ క్రిస్‌ గేల్‌పై ఉంది.
పంజాబ్‌ తొలి మ్యాచ్‌లో గేల్‌ ఆడలేదు. ఈరోజు జరిగే రెండో మ్యాచ్‌లో కూడా గేల్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు ప్రధాన కోచ్ డానియేల్ వెటోరి మాట్లాడుతూ 'చిన్నసామి స్టేడియంలో క్రిస్ గేల్ నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఒకవేళ గేల్‌ను పంజాబ్ ఆడించినా.. అతడిని కట్టడి చేసేందుకు తమ వద్ద గేమ్ ప్లాన్ ఉంది' అని అన్నాడు.
దీంతో రెండో మ్యాచ్‌లో క్రిస్ గేల్‌ ఆడితే ఎలా ఎదుర్కోవాలో అన్న దానిపై ఇప్పుడు బెంగళూరు దృష్టి సారించింది. కాగా, ఐపీఎల్ పదకొండో సీజన్‌లో క్రిస్ గేల్‌ను ఆర్‌సీబీ వదులుకోవడంతో వేలంలో కనీస ధరకు పంజాబ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో గేల్‌ను ఆడించలేదు.
శుక్రవారం తమతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు క్రిస్ గేల్‌ను బరిలోకి దించితే ఓడిపోతామనే గుబులు బెంగళూరులో ఇప్పుడే మొదలైంది. వచ్చే మూడేళ్లను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసిందని, అందుకే క్రిస్ గేల్‌ను బెంగళూరు యాజమాన్యం తీసుకోలేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form