Sri Reddy Comments On Manchu Lakshmi, Pawan Kalyan Fans. Responding seriously over PK's fans over their threatening Sri Reddy warns Pawan Kalyan to Control his Fans.
సినీ పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి మహిళా సంఘాలతో కలిసి సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ పోరాటాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. ఇండస్ట్రీని ఏలుతున్న నాలుగు కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఈ సందర్భంగా ఆమె విమర్శలు గుప్పించింది.
ప్రభుత్వానికి చెప్పేది ఒకటే... మా సమస్యలు మీ దృష్టికి వస్తున్నా పట్టించుకోవడం లేదు. మమ్మల్ని పట్టించుకోక పోతే మా పరిస్థితి ఏమిటి? వ్యభిచారాన్ని బ్యాన్ చేశారు. నేను ఈ సందర్భంగా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అడుగుతున్నాను... ఆర్టిస్టులమైన మేము ఎలా బ్రతకాలి? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఇక్కడ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. మేము ఆర్టిస్టులం, ఆర్టిస్టులుగానే ఉంటాం. ఈ కళామతల్లికే మా జీవితం అంకితం. వ్యభిచారులు అంటూ కొందరిని అరెస్టు చేసి పట్టుకు పోతున్నారు, అవకాశాలు లేనపుడు వారు ఏం చేసి బ్రతకాలి.... అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.
మాకు అవకాశాలు ఇస్తారా 70 శాతం అంటే.... పెట్టుబడి దారులు వారు, వారికి ఇష్టం వచ్చిన వారిని తీసుకుంటారు అని కొందరు అంటున్నారు. అలా అయితే ముంబై వారిని తీసుకుంటే మీ సినిమాలు ముంబైలోనే రిలీజ్ చేయండి, ఫారిన్ వారిని తీసుకుంటే ఫారిన్ లోనే రిలీజ్ చేయండి. తెలుగు ప్రాంతాల్లో మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు.... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.
సినిమాల్లో అవకాశాలు లేవు కనీసం మోడలింగ్ చేసుకుందామన్నా ఈ లక్ష్మి ప్రసన్న లాంటి వారు వాలిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్రతికనివ్వరు, మోడలింగులో బ్రతకనివ్వరు, టీవీ షోలు చేసుకుందామంటే లక్ష్మి ప్రసన్న లాంటి వారు అక్కడికి కూడా వచ్చేస్తే మేము ఎలా బ్రతకాలి? ప్రతి దాంట్లో మీరే ఎగబడి పోతుంటే మాలాంటి వారు ఏం చేసుకోవాలి?... అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.
అవార్డులు అవార్డులు అంటారు.... అవి కూడా కొనుక్కోవాల్సిన దరిద్రం. ఇవేమైనా బటానీలా? దీనికి కూడా రికమండేషన్స్. ప్రతి దాంట్లోనూ మీ ఇన్ ఫ్లూయోన్సేనా? మీరే యాక్టర్లు, మీకే అవార్డులు డిసైడ్ చేసే వారు అయితే ఎలా? బ్యాన్ చేయండి.... మీ నాలుగు కుటుంబాలు మాత్రమే సినిమాలు చేసుకుంటాం, ఎవరూ రావద్దు అని బోర్డు పెట్టండి. మేము టైమ్ వేస్ట్ చేసుకోకుండా మా పనులు మేము చేసుకుంటాం.... అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.