Pawan Kalyan Fans Slogans Against Sri Reddy

Filmibeat Telugu 2018-04-19

Views 501

Pawan Kalyan fans slogans against SriReddy in front of TV Channel. Police gives security to SriReddy

శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రగడ ఎక్కువవుతోంది. కాస్టింగ్ కౌచ్ పై, తాను చేస్తున్న పోరాటంపై పవన్ స్పందన సరిగాలేదని శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పవన్ అభిమానులు శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో అటాక్ మొదలుపెట్టారు. ట్రోలింగ్ చేస్తూ శ్రీరెడ్డి చర్యల్ని తప్పుపడుతున్నారు. దీనితో శ్రీరెడ్డి పోరాటంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
పవన్ కళ్యాణ్ ని ఈ విషయంలోకి అనవసరంగా లాగి ఆయన తల్లిని దుర్భాషలాడిందని శ్రీరెడ్డిపై పవన్ ఫాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. యూట్యూబ్, ట్విట్టర్, పేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డిపై దాడికి దిగుతున్నారు. శ్రీరెడ్డి క్షమాపణ చెప్పినా వారి ఆగ్రహం చల్లారడం లేదు
కాస్టింగ్ కౌచ్, దళారీ వ్యవస్థ, తెలుగు నటులకు అవకాశాలు వంటి అంశాలపై నాగబాబు మాట్లాడారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ ని ఈ విషయంలోకి లాగి దూషించడాన్ని ఆయన తప్పుబట్టారు.ప్రజల్లోకి వెళ్లి బిజీగా ఉన్న పవన్ ని ఈ విషయంలోకి లాగడం ఏంటని నాగబాబు ప్రశ్నించారు. దీనివెనుక రాజకీయ శక్తులు ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసారు. దీనితో పవన్ అభిమానుల్లో శ్రీరెడ్డిపై మరింతగా ఆగ్రహం పెరిగింది.
బుధవారం ఓ టివి చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీరెడ్డి వచ్చిందని తెలుసుకున్నా పవన్ ఫాన్స్ అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నజూబ్లీ హిల్స్ పోలీస్ లు అక్కడకు చేరుకున్నారు. శ్రీరెడ్డిని పోలీస్ బందోబస్తుతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీరెడ్డిని కొంత సమయం పోలీస్ స్టేషన్ లో ఉంచాక ఆ తరువాత ఆమెని తన నివాసానికి చేర్చారు.

Share This Video


Download

  
Report form