ollywood Cinematographer Joseph labisi Filmed A Song " Lover Also Fighter Also " In Naa Peru Surya. He Worked For Several Famous Films & Pop Songs , Music Albums In Hollywood
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా".
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే అదిరిపోయే యాక్షన్స్ సీక్వెన్స్, ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసే డాన్స్ ఉంటుంది. మరి వాటిని పర్ఫెక్టుగా తెరపై రిఫ్లెక్ట్ చేయాలంటే సినిమాటోగ్రాఫర్ ఎంతో కీలకం. అందుకే ఈ విషయంలో నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. తాజాగా 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కోసం హాలీవుడ్ నుండి సినిమాటోగ్రాఫర్‌ను హైర్ చేసుకున్నారట.
లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో' అనే పాట చిత్రీకరణ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ లబిసి పని చేశారు. సినిమాలో ఈ పాట ఎంతో స్పెషల్‌గా ఉంటుందని, అందుకే అతడిని హాలీవుడ్ నుండి హైర్ చేసుకున్నట్లు సమాచారం. ఇతడికి ఇంతకు ముందు హాలీవుడ్ చిత్రాలు, పాప్ సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ చిత్రీకరించిన అనుభవం ఉంది.
ఏప్రిల్ 22న మిలట్రీ మాధవరంలో ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ ఆడయో ఫంక్షన్ లో పాల్గొనబోతున్నారు. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు