Jana Sena Party chief, power star Pawan Kalyan has finally opened up on the controversy surrounding Sri Reddy's abusive rant against him and called the incident a conspiracy led by TDP.
జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్‌తో పాటు కొందరు మీడియా సంస్థల అధినేతలను లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
సినీ పరిశ్రమను కుదిపేసిన శ్రీరెడ్డి వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. శ్రీరెడ్డి వెనుక ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఉన్న విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్ష ప్రారంభ సమయానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి వ్యవహరం వెనుక ఏపీ మంత్రి నారాలోకేష్ అతని స్నేహితుడు రాజేష్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
శ్రీరెడ్డి వ్యవహరం వెనుక మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆయన స్నేహితుడు రాజేష్‌లు ఉన్నారని చెప్పారు. అంతేకాదు ఈ విషయమై కొన్ని మీడియా సంస్థలు కూడ టిడిపికి అనుకూలంగా పనిచేశాయని ఆరోపించారు.తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరతీశాయి. అయితే ఈ చర్చ ఏ మేరకు రాజకీయాలపై ప్రభావం చూపుతోందనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టిడిపి నేతలు మౌనమే మేలని భావిస్తున్నారు. ఈ విషయమై ఎవరూ కూడ మాట్లాడకూడదని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో ఈ వ్యాఖ్యలపై దీక్ష తర్వాత ఆ పార్టీ నాయకత్వం నోరు తెరుస్తోందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిని కల్గిస్తోంది. అయితే దీక్ష నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారని టిడిపి నాయకత్వం అనుమానిస్తోంది .