IPL 2018: MS Dhoni Doubtful For CSK Clash Against Rajasthan Royals

Oneindia Telugu 2018-04-20

Views 85

Chennai Super Kings (CSK) might miss their skipper MS Dhoni when they take on Rajasthan Royals at their new home MCA STadium, Pune, on Friday. Dhoni missed the CSK practice session in Pune on Wednesday. The 36-year-old had earlier hurt his back during a 44-ball unbeaten 79 against Kings XI Punjab at Mohali.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్న తొలి మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నారు. అయితే, కెప్టెన్ ధోని మాత్రం ఈ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు.
దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ధోని అందుబాటులో ఉండడేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై జట్టు మేనేజ్‌మెంట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన సురేశ్ రైనా కోలుకుని నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనడం విశేషం.
గత ఆదివారం కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని వెన్ను నొప్పితో బాధపడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. చెన్నై ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో నొప్పిని భరించలేని ధోనీ ఫిజియోను పిలిపించుకుని ట్రీట్‌మెంట్‌ కూడా చేయించుకున్నాడు. అయితే, ఈ గాయం నుంచి ధోని ఇంకా కోలుకున్నట్లు లేదు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోని ఆడతాడో లేదో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. కావేరీ జల వివాదం కారణంగా చెన్నైలో సొంతగడ్డపై జరగాల్సిన మ్యాచ్‌లన్ని ఐపీఎల్ నిర్వాహకులు పూణెకు తరలిన సంగతి తెలిసిందే. కాగా, చెన్నై మ్యాచ్‌లను వీక్షించేందుకు 'విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్'లో అభిమానులు చెన్నై నుంచి పూణెకు చేరుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS