Sunrisers Hyderabad bowlers put up a sensational effort to defend a modest total of 118 and stunned defending champions, Mumbai Indians, by 31 runs in their Indian Premier League (IPL) 2018 encounter here on Tuesday (April 24).
#Sunrisers Hyderabad
#Mumbai Indians
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ జట్టులో రెండు మార్పులు చేసింది. భువనేశ్వర్, స్టాన్‌లేక్‌ల స్థానంలో మహ్మద్ నబీ, బాసిల్ థంపిని తుది జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో వీరిద్దరికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. మరోవైపు గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఐపీఎల్‌లో రెండు వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 87 పరుగులకే ఆలౌటైంది.
తాజా విజయంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టు అని మరోసారి రుజువు అయింది.