IPL 2018: A Bitter Pill to Swallow For Kohl

Oneindia Telugu 2018-04-26

Views 78

Royal Challengers Bangalore captain Virat Kohli has been fined ₹12 lakh for maintaining slow over-rate during their Indian Premier League (IPL) against Chennai Super Kings on Wednesday night.
#Kohli
#Dhoni
#RCB
#CSK

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై, బెంగుళూరుల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చెన్నై దూకుడుతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్, డికాక్‌లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడినా లాభం లేకుండాపోయింది. వారి శక్తి మేరకు విజృంభించి ఎనిమిది వికెట్ల నష్టానికి 205పరుగులు చేశారు. లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు ధోనీ దూకుడుతో విజయం సాధించింది. ధోనీ సిక్సుల మెరుపులతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది.
ఈ ఓటమికే కుంగిపోయిన బెంగళూరు జట్టుకు మరో కష్టం ఎదురైంది. బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ఐపీఎల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత సమయానికి ఓవర్లు వేయలేకపోవడంతో ఈ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించింది.
'ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్‌ ఓవర్‌ రేట్‌‌ నియమావళిని అతిక్రమించింది. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి. ఈ కారణంగానే ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధిస్తున్నాం' అని ఐపీఎల్‌ నిర్వాహకులు మీడియాకు లేఖ విడుదల చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS