Captain Rohit Sharma admitted that this habit is something he hopes to see change after they thrashed the Kolkata Knight Riders by 102 runs at the Eden Gardens.
ఆరంభంలో చతికిలబడ్డ రెండో భాగంలో క్రమేపీ పుంజుకుంటోంది ముంబై జట్టు. దాదాపు ప్లేఆఫ్ మ్యాచ్ కోల్పోతే ఇక ఆశలు వదులుకున్నట్లే అనే సమయంలో మెరిసింది. మే 4వ తేదీ పంజాబ్‌తో మొదలుకొని వరుసగా కోల్‌కతాను రెండు సార్లు ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ పరిణామంపై ఆ జట్టు కెప్టెన్ మాట్లాడుతూ.. ఇలా స్పందించాడు.
మే నెలలోనే మేం అద్భుతంగా రాణిస్తుంటాం. మూడేళ్లుగా టోర్నీ ద్వితియార్ధంలోనే బాగా ఆడుతున్నాం.. అని అభిప్రాయపడ్డాడు. మరీ ముఖ్యమంగా గడిచిన మూడేళ్లలో ఫస్ట్ ఆఫ్‌లో ఫ్లాప్ కావడం.. సెకండాఫ్‌లో హిట్ కావడం రివాజుగా మారింది. దీనిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2018లో భాగంగా బుధవారం కోల్‌కతాపై ముంబై 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఏమిటన్న ప్రశ్నకు రోహిత్ తడుముకోకుండా ఇషాన్ ఇన్నింగ్స్ తోనే ఇంత భారీ టార్గెట్ ను నమోదు చేయగలిగాం.
ఇషాన్ కిషన్ తనదైన రోజు కోసం ఎదురుచూశాడు. అతను ఆటాడిన తీరు నిజంగా అద్భుతం. వాస్తవానికి పిచ్ కాస్త ఇబ్బంది పెట్టింది. అయినాసరే అతను ఏమాత్రం భయపడకుండా బీభత్సం సృష్టించాడని చెప్పొచ్చు. చివర్లో బెన్ కట్టింగ్ సైతం అసాధారణంగా ఆడాడు. జట్టును ప్లేఆఫ్ రేసులో సజీవంగా నిలపడానికి సమిష్టిగా కృషించాం. చక్కటి ఫలితాన్ని రాబట్టగలిగాం