Forced to step down as Australia's coach owing to the ball-tampering scandal, Darren Lehmann will now groom young talent as part of a National Performance Programme, Cricket Australia announced on Wednesday.
#Darrenlehmann
#Australia
#Balltampering
బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా పదవి నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెమన్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. సఫారీ గడ్డపై కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.
దీంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాదిపాటు నిషేధం విధించగా, కామెరూన్ బాన్‌క్రాప్ట్‌పై తొమ్మది నెలల పాటు నిషేధం విధించింది. అయితే, ఈ మొత్తం వ్వవహారంతో అప్పటి కోచ్ డారెన్ లీమన్‌కు ఎటువంటి సంబంధం లేనప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశాడు.
అతడి స్థానంలో ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త కోచ్‌గా ఆ దేశ మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించింది. కాగా, కోచ్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న 48 ఏళ్ల లీమన్ క్రికెట్ ఆస్ట్రేలియాతో సరికొత్త ఒప్పందం కుదుర్చుకున్నాడు. నేషనల్ ఫెర్మార్మెన్స్ జట్టుకు మే 28 నుంచి అక్టోబరు వరకు శిక్షణ ఇవ్వనున్నాడు.
క్రిస్ రోజెర్స్, ర్యాన్ హారిస్‌తో కలిసి ఆస్ట్రేలియాలోని యువ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వనున్నాడు. డారెన్ లెమన్ ఆస్ట్రేలియా తరపున 27 టెస్టులు, 117 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. రెండుసార్లు వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో లీమన్ సభ్యుడు కాగా, ఓసారి కోచ్‌గా ఉన్నాడు.