IPL 2018: Kohli Entertains RCB Teammates At His Own Restaurant

Oneindia Telugu 2018-05-11

Views 225

Royal Challengers Bangalore captain Virat Kohli, who hails from Delhi, played the perfect host for his team at his new restaurant in the capital where RCB will play their 11th match against Delhi Daredevils at the Feroz Shah Kotla on May 12.
#RoyalChallengersbangalore
#Kohli
#Delhidaredevils
#IPL2018

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ, బెంగళూరు జట్లు ఫిరోజ్ షా కోట్లా వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు, ఢిల్లీ జట్లు దేశ రాజధాన్ని ఢిల్లీ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరికీ కోహ్లీ తన సొంత రెస్టారెంట్‌లో భోజనాన్ని రుచి చూపించాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆటగాళ్లందరూ కలిసి ఆ రెస్టారెంట్‌లో సందడి చేశారు. తమకు నచ్చిన ఆహార పదార్థాల రుచి చూశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ఓ రెస్టారెంట్‌ ఉన్న సంగతి చాలా మందికి తెలుసు. 'నుయేవా' పేరిట నిర్వహిస్తోన్న ఈ రెస్టారెంట్‌ స్థానికంగా ఎంతో ఫేమ్‌స్‌. ఏబీ డివిలియర్స్‌తో దిగిన ఫొటోను కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీ, డివిలియర్స్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, క్రిస్‌ వోక్స్‌, చాహల్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ఇక్కడికి వచ్చిన వారిలో ఉన్నారు.
టోర్నీలో భాగంగా బెంగళూరు-ఢిల్లీ మధ్య శనివారం మ్యాచ్‌ జరగనుంది. వరుస ఓటములతో ఇప్పటికే ఢిల్లీ ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకుంది. రేపు జరిగే మ్యాచ్‌లో ఒకవేళ ఢిల్లీ చేతిలో బెంగళూరు ఓడితే కోహ్లీ సేన కూడా ప్లేఆఫ్స్‌కు దూరమైనట్లే.
మే7వ తేదీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు వచ్చిన బెంగళూరు జట్టు సహచరుడైన మొహమ్మద్ సిరాజ్ ఇంట్లో సందడి చేసింది. బిర్యానీ, డబల్ కా మిఠాతో పాటు విందు భోజనంతో ఆతిథ్యంతో అందుకుంది. ఆఖరి మ్యాచ్ లోనూ పరాజయం పాలైన కోహ్లీసేన శనివారం జరిగే మ్యాచ్ లో ఢిల్లీతో పోటీ పడి గెలిస్తే ప్లేఆఫ్‌లో తలపడేందుకు అవకాశం దక్కించుకుంటుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS