AB de Villiers Describes How He Proposed To His Wife

Oneindia Telugu 2018-05-16

Views 45

AB de Villiers elaborately planned the moment when he asked his ... on the occasion of his brother Wessels's marriage that their love re-ignited.
#AbDeVilliers
#SouthAfrica
#JontyRhodes
#IPL2018

'నాకు మళ్లీ కొడుకు పుడితే 'తాజ్‌' అని పేరు పెడతా' ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఏబీ డివిలియర్స్‌. తాజాగా ఓ ఛానెల్‌కు జాంటీ రోడ్స్‌తో కలిసి ఇచ్చిన ఇంటర్యూలో డివిలియర్స్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘నాకు మళ్లీ కొడుకు పుడితే ‘తాజ్‌' అని పేరుపెడతా. ఎందుకంటే నాకు భారత్‌, ఇక్కడ ఉన్న తాజ్‌మహల్‌ అంటే చాలా ఇష్టం. 2012 ఐపీఎల్‌ జరిగే సమయంలో నేను తాజ్‌మహల్‌ వద్దే డేనియల్లికి నా ప్రేమను వ్యక్త పరిచాను. 2013లో మా ఇద్దరికీ పెళ్లి అయ్యింది. 2015లో మాకు ఒక బాబు పుట్టాడు' అని డివిలియర్స్ అన్నాడు.
'అతడి పేరు అబ్రహం డివిలియర్స్‌. నాకు మళ్లీ కొడుకు పుడితే మాత్రం ‘తాజ్‌' అని పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాను. అంతకుముందు ‘కర్ణాటక' అని పెడదామనుకున్నాను కానీ ‘తాజ్‌' పేరే బాగా నచ్చింది. ఇదే పెడతాను' అని డివిలియర్స్ అన్నాడు. ఇదే ఇంటర్యూలో కోహ్లీతో తనకున్న అనుబంధంపై కూడా డివిలియర్స్ స్పందించాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన డివిలియర్స్‌ 358 పరుగులు చేశాడు. టోర్నీలో భాగంగా బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో గురువారం నాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. బెంగళూరు ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకోవాలంటే టోర్నీలోని మిగతా రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి.
దక్షిణాఫ్రికాకు చెందిన చాలా మంది క్రికెటర్లకు ఇండియా అంటే ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే ఆ దేశ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ తన కుమార్తెకు ‘ఇండియా' అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాంటీ రోడ్స్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు. ఖాళీ సమయాల్లో సందర్శించేందుకు కూడా జాంటీ రోడ్స్ భారత్‌కు వస్తుంటాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS