If a recent report in Times of India is to be believed, Karan Johar has approached the Baahubali star for a project. But Prabhas is currently busy shooting for his big-budget film Saaho. Therefore, the actor reportedly said no to the filmmaker.
#Saaho
#Prabhas
#KaranJohar
బాహుబలి ప్రాజెక్టు తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభార్ రేంజి ఒక్కసారిగా నేషనల్ లెవల్‌కి వెళ్లింది. బాలీవుడ్ నుండి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ హిందీ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ప్రభాస్‌ను తన సినిమా ద్వారా నేరుగా బాలీవుడ్లో లాంచ్ చేయాలనుకున్నారు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఇద్దరి మధ్య పొసగక పోవడంతో అది వర్కౌట్ కాలేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. తర్వాత ప్రభాస్ 'సాహో' ప్రాజెక్టులో బిజీ అయిపోయారు. తాజాగా కరణ్ జోహార్ మరోసారి ప్రభాస్‌ను సంప్రదించినట్లు సమాచారం.
ప్రభాస్‌తో సినిమా చేయాలని కరణ్ జోహార్ మరోసారి సంప్రదింపులు జరిపారని, అయితే ప్రస్తుతం ‘సాహో' సినిమాతో బిజీగా ఉండటం, దీని తర్వాత ఇతర తెలుగు ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ ఉండటంతో అతడి ఆఫర్ సున్నితంగా తిరస్కరించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. హైదరాబాద్, ముంబై షెడ్యూల్ పూర్తయిన వెంటనే తర్వాతి షెడ్యూల్ కోసం చిత్ర బృందం అబుదాబి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 50 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించే సన్నివేశాలు మూవీలో హైలెట్ కానున్నాయట.
సాహో'లో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోగా నటిస్తుండగా, నీల్ నితిన్ ముఖేష్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ హిందీ నటుడు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన నటులను ఇక్కడి నుండి సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సాహో' చిత్రం హిందీ వెర్షన్ రైట్స్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, ట-సిరీస్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈచిత్రం రిలీజ్ కాబోతోందని చర్చించుకుంటున్నారు. ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యూవి క్రియేషన్స్ బేనర్లో ‘సాహో' చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.